జగన్ డిక్లరేషన్ ఇవ్వాల్సిందే.. టీటీడీ!
Published on: Fri Sep 27, 2024 12:26PM

తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం అంశం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలోనే జగన్ తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు రెడీ అయ్యారు. అయితే జగన్ తిరుమల పర్యటన వేళ తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. జగన్ తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలంటే డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని తిరుమల తిరుపతి దేవస్థానం స్పష్టం చేయాలని నిర్ణయించుకుంది. శ్రీవారి దర్శనం కోసం వచ్చే అన్యమతస్థుల నుంచి డిక్లరేషన్ కోరినట్లే వైఎస్ జగన్ నుంచీ తీసుకోవాలని టీటీడీ అధికారులు నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇందు కోసం ఆయన దర్శనానికి బయలుదేరడానికి ముందుగానే అతిధి గృహం వద్దకు వెళ్లి ఆయనకు డిక్లరేషన్ ఫారాన్ని అందించాలని, ఆయన సంతకం చేస్తేనే దర్శనానికి అనుమతి ఇవ్వాలని టీటీడీ నిర్ణయించింది.


