TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమల పైకి జగన్ దండయాత్ర?

Published on: Fri Sep 27, 2024 12:19PM

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిరుమల పర్యటన దైవ దర్శనానికా, లేక దేవుడిపై యుద్ధానికా అన్న అనుమానం కలుగుతోందని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయనీ, ఈ విషయంపై సీట్ విచారణను స్వాగతిస్తున్నాననీ పులివర్తి నాని పేర్కొన్నారు.  వేల మందితో తిరుమలకు రావడం చూస్తుంటే జగన్ తిరుమల వెంకన్న దేవుడి దర్శనం పేరు చెప్పి  తిరుమలపైకి దండయాత్రకు వస్తున్నారన్న అనుమానం కలుగుతోంది. తిరుమలలో శాంతి భద్రతల సమస్య సృష్టించే లక్ష్యంతోనే జగన్ గూండాలను తీసుకుని తిరుమలకు వస్తున్నారని ఆరోపించారు.