TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

డిక్లరేషన్‌పై నిర్ణయం టీటీడీదే!

Published on: Fri Sep 27, 2024 12:14PM

జగన్ తిరుమల పర్యటన వేళ రాష్ట్రం అంతటా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొని ఉన్నాయి. జగన్ పర్యటన సందర్భంగా తిరుమల కొండపై ఏం జరుగుతుందా అన్న ఆందోళన సర్వత్రా వ్యక్తం అవుతోంది. అటువంటి వేళ ఈ ఉద్రిక్తతలను ఏదో మేర తగ్గించేందుకు జనసేనాని పవన్ కల్యాణ్ నడుం బిగించినట్లు కనిపిస్తోంది. జగన్ తిరుమల దేవుడి దర్శనం చేసుకోవాలంటే డిక్లరేషన్ ఇవ్వాల్సిందే. అయితే డిక్లరేషన్ విషయంలో నిర్ణయం తీసుకోవలసింది తిరుమల తిరుపతి దేవస్థానం మాత్రమేనని, ఈ విషయంలో ఎటువంటి ఆందోళనలు, నిరసనలకు పాల్పడవద్దంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.