సిబిఐకి నాకు తెలిసింది చెప్పా:కెవిపి రామచంద్రారావు
Published on: Mon Jan 16, 2012 1:59PM
హైదరాబాద్:దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో ప్రభుత్వ సలహాదారుగా పని చేసిన కెవిపి రామచంద్రారావు సోమవారం ఉదయం సిబిఐ ఎదుట హాజరయ్యారు.ఆయనను సిబిఐ సుమారు మూడు గంటలకు పైగా విచారించింది.సిబిఐ తనను కొన్ని వివరాలు అడిగిందని,తనకు తెలిసిన సమాచారం వారికి అందించానని తెలిపారు. ఎమ్మార్ కేసులో తనను సిబిఐ సాక్షిగా పిలిచిందని చెప్పారు.సిబిఐ దర్యాఫ్తుకు తాను పూర్తిగా సహకరిస్తానన్నారు.కెవిపి రామచంద్రా రావు తన సతీమణి పేరుతో విల్లా కొన్నారు అందుకు సంబంధించిన పత్రాలతో హాజరయ్యారు. ఎమ్మార్ వ్యవహార సమయంలో కెవిపి ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు. దీంతో ఈ వ్యవహారంలో ఆయనకు ఏమైనా తెలుసా అన్న కోణంలో సిబిఐ ఆయనను విచారించింది.ఆయన వాంగ్మూలాన్ని సిబిఐ నమోదు చేసింది.


