మోడీపై ఖుష్బూ కామెంట్లు....భోజనం చేసి దీక్ష చేసిన ఏకైక ప్రధాని..

 

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏపీ ఎంపీలందరూ పార్లమెంట్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చేసిన సంగతి తెలిసిందే. కేంద్రంపై అవిశ్వాస తీర్మానం కూడా పెట్టారు. అయితే దానిపై చర్చ జరగకుండా కేంద్రం పలు డ్రామాలు ఆడిందనుకోండి. పైగా విపక్షాలు చర్చలు జరగకుండా అడ్డుకున్నాయని... దానిని నిరసిస్తూ ప్రధాని మోడీ దీక్ష చేయడం హాస్యాస్పదం. ఇక ఇప్పుడు ఆయన చేసిన దీక్షపై  తమిళనాడు కాంగ్రెస్ నేత, సినీ నటి ఖుష్బూ స్పందించి కామెంట్లు విసిరారు. ఆ రోజు తమిళనాడు పర్యటనకు వచ్చిన ప్రధాని విమానంలోనే ఉదయం టిఫిన్‌, మధ్యాహ్నం భోజనం తీసుకున్నారని ఖుష్బూ సంచలన విమర్శ చేశారు. ప్రపంచంలో భోజనం చేసి దీక్ష చేపట్టిన ఏకైక ప్రధాని నరేంద్ర మోదీయేనని ఆమె వ్యంగ్యంగా అన్నారు. తమిళుల ఆందోళనలకు భయపడిన ప్రధాని రోడ్డు మార్గంలో ప్రయాణించకుండా హెలికాప్టర్ లో తిరిగారని ఆమె విమర్శించారు.