కోట్లకు బొత్సా జలక్
Published on: Fri Mar 16, 2012 5:00PM
కర్నూల్ ఎంపి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి పిసిసి అధ్యక్షులు బొత్స సత్యనారాయణ జలక్ ఇచ్చారు. ఆలూరు వ్యవసాయ మార్కెట్ కమిటి ఏర్పాటు విషయంలో బొత్స సత్యనారాయణ తన వర్గానికి చెందిన ఆలూరు ఎమ్మెల్యే నీరజారెడ్డి మాటకు ప్రాధాన్యత ఇచ్చారు. నిజానికి బొత్స ఈ పదవుల విషయంలో మొదట కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి హామీఇచ్చారు. అయితే తరువాత మారిన పరిణామాల దృష్ట్యా ఆయన కోట్ల మాటను పక్కన పెట్టి నీరజారెడ్డి సూచించిన సభ్యులకు పదవులు వచ్చేలా చక్రం తిప్పారు. దీంతో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అవాక్కయ్యారు. ఈ ప్రాంతంలో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి - నీరజారెడ్డి మధ్య చాలాకాలం నుంచి విభేదాలున్నాయి. ఇద్దరూ పరస్పరం బహిరంగంగా విమర్శించుకునేవారు. ఈ పదవుల విషయంలో బొత్స చర్యతో వీరి మధ్య అగాధం మరింత పెరిగింది.


