TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కర్నూల్ లో ఇనుప ఖనిజాన్ని దోచేస్తున్న ఖద్దరుబాబులు

Published on: Thu Mar 22, 2012 10:01AM

కర్నూల్ జిల్లాలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు చెందిన ఇద్దరు ప్రముఖ నాయకులు ఇనుప ఖనిజాన్ని పోటా పోటీగా అక్రమంగా తవ్వేసి రవాణా చేసేస్తున్నారు. గుంటుపల్లె, ఉస్సేనాపురం, పాపసానికొట్టాల, ముసలాయ చెరువు, తవిసికొండ తదితర ప్రాంతాల్లో ఇనుప ఖనిజాన్ని ప్రొక్లెయిన్ల సహాయంతో తవ్వి లారీల్లో నింపి రాత్రికి రాత్రే రవాణా చేసేస్తున్నారు. వీరు నిత్యం రోజుకు 250 నుంచి 300 లారీల వరకు ఇనుప ఖనిజాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నారు. నిజానికి ఇక్కడ ఎవరికీ లీజు లైసెన్సులు లేకపోయినప్పటికీ దోపిడీ అప్రతిహతంగా సాగుతోంది. ఒకవేళ లీజు లైసెన్స్ ఉంటే ఒక్కో లారీకి రాయల్టీ, వే బిల్లుల రూపంలోల్ రూ.3600 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఇటువంటి చెల్లింపులేవీ లేకుండా వందలాది లారీల్లో ఇనుప ఖనిజాన్ని రవాణా చేస్తూ కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో నామ మాత్రంగా చెక్ పోస్టులున్నా రాజకీయ నాయకుల ఒత్తిడితో అధికారులు ఏమీ చేయలేకపోతున్నారు.