ఉదయం పెళ్లి.. నైటుకు జంప్..


ఎన్నో ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించాలని అని అనుకున్న ఓ యువతి ఆశలు.. అశలుగానే మిగిలాయి. ఉదయం పెళ్లి అయి.. రాత్రికి రాత్రే పెళ్లి కొడుకు జంప్ అవ్వడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు కుటుంబసభ్యులు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. కర్నూలు జిల్లా జూపాడుబంగ్లా గ్రామానికి చెందిన వెంకటస్వామి, కళావతి కుమార్తె వెంకటలక్ష్మికి మహబూబ్‌నగర్‌ జిల్లా కొల్లాపూరు గ్రామానికి చెందిన రమణమ్మ, నరసింహ దంపతుల ప్రథమ పుత్రుడు కురుమూర్తితో వివాహం జరిగింది. అయితే పెళ్లి అయిన పన్నెండు గంటల్లోపే పత్తాలేకుండా పోయాడు పెళ్లి కొడుకు. పెళ్లి అనంతరం రాత్రి అంతా నిద్రిస్తున్న సమయంలో పెళ్లి కొడుకు ఎవరికి చెప్పకుండా పరారయ్యాడు. దీంతో ఉదయం లేచి చూసే సరికి పెళ్లికొడుకు లేకపోవడంతో వెంకటలక్ష్మీ పోలీసులను అశ్రయించింది. అయితే ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే..  కురుమూర్తికి గతంలోనే విహాహమైందని.. మొదటి భార్య కూడా పోలీసులకు ఫిర్యాదు చేసిందని బంధువులు అంటున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు.