కుప్పం ఫై ప్రభుత్వం వివక్ష..బాబు దృష్టి
Published on: Tue Jan 3, 2012 3:10PM
చిత్
తూరు: కుప్పం పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడమే తన ధ్యేయమని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు.తన నియోజకవర్గం కుప్పం పట్ల ప్రభుత్వం వివక్ష ప్రదర్శిస్తోందని అయన విమర్శించారు. ఆయన కుప్పం నియోజకవర్గంలో పర్యటించారు. ఆయన కుప్పాన్ని ఓ విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్లు ఆయన తెలిపారు.రాష్ట్రంలో అసమర్థ పాలన సాగుతోందని, దాంతో అభివృద్ధి వేగం ఆగిపోయిందని ఆయన అన్నారు. వ్యవసాయం లాభసాటిగా మారే వరకు తాను పోరాటం చేస్తానని ఆయన చెప్పారు. మద్యం సిండికేట్లలో కాంగ్రెసు నాయకులు 5 వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో మద్యం మాఫియా పేదల రక్తాన్ని పిండుకుంటోందని ఆయన అన్నారు. అయిదు వేల కోట్ల రూపాయల మద్యం సిండికేట్ల అక్రమాలే అందుకు నిదర్శనమని ఆయన అన్నారు.కాంగ్రెసు పాలనలో ప్రజలు అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు.
కాంగ్రెసు పాలనలో కరెంట్ కోతలు తీవ్రం కావడంతో వ్యవసాయం చేయలేని పరిస్థితి దాపురించిందని ఆయన అన్నారు.తన తొమ్మిదేళ్ల పాలనలో రోజుకు 9 గంటలు విద్యుత్ సరఫరా చేశామని ఆయన గుర్తు చేశారు. విద్యుత్ చార్జీల పెంపు ద్వారా ప్రజలపై ప్రభుత్వం రూ. 10 వేల కోట్ల భారం మోపుతోందని ఆయన విమర్శించారు. సూక్ష్మ రుణాల వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని ఆయన అన్ారు. ఓ పక్క వ్యవసాయ పెట్టుబడి ఖర్చులు పెరుగుతుండగా, మరో వైపు రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదని ఆయన అన్నారు. ప్రజలపై ప్రభుత్వం పన్నుల భారం మోపుతోందని, రెండేళ్ల తర్వాత ఈ ప్రభుత్వం బంగాళాఖాతంలో కలిసి పోవడం ఖాయమని ఆయన అన్నారు.


