కుల్ భూషణ్ కేసులో అంతర్జాతీయ కోర్టు తీర్పు.. పాక్ కు పరాభవం..

 

అందరూ ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూసిన కుల్ భూషణ్ యాదవ్ కేసులో అంతర్జాతీయ కోర్టు తీర్పును వెలువరించింది. అంతర్జాతీయ న్యాయస్థానంలో పాక్ కు పరాభవమే ఎదురైంది. పాక్ అభ్యంతరాలను న్యాయమూర్తులు తోసిపుచ్చిన కోర్టు..కుల్ భూషణ్ యాదవ్ ఉరిశిక్షపై స్టే విధించింది.  కాన్సులర్ యాక్సెస్ పొందే హక్కు భారత్ కు ఉందని..తదుపరి ఆదేశాలు వచ్చేవరకూ జాదవ్ కు ఉరితీయడానికి వీలు లేదని.. పాక్ మా ఆదేశాలు పాటించాల్సిందే ఆదేశించింది. అంతేకాదు తమ ఆదేశాలపై తీసుకున్న చర్యలను ఎప్పటికప్పుడు తెలియజేయాలని సూచించింది.

 

గూఢాచార్యం ఆరోపణల కింద పాక్ కుల్ భూషణ్ జాదవ్ ను అరెస్ట్ చేసి అతనికి మరణశిక్ష విధించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై భారత్ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈనెల 8న పిటిషన్ దాఖలు చేయగా..15న ఒకరోజు విచారణ జరిగింది. ఎటువంటి ఆధారాలు చూపకుండా పాకిస్థాన్ శిక్ష విధించిందని భారత్ వాదనలు చేసింది. దీనికి గాను గూఢాచారులకు అంతర్జాతీయ ఒప్పందాలు వర్తించవంటూ పాక్‌ ప్రతివాదన చేసింది.