జాదవ్ పై మరో కేసు...

 

గూఢాచర్య ఆరోపణల్ని ఎదుర్కొంటూ ఇప్పటికే కుల్ భూషణ్ జాదవ్ ప్రస్తుతం పాక్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు పాక్ ఆయనపై మరో కేసును నమోదు చేసింది. జాదవ్ కు పాక్ మరణశిక్ష విధించగా... అంతర్జాతీయ న్యాయస్థానం కలుగజేసుకోవడంతో మరణశిక్ష అమలును తాత్కాలికంగా వాయిదా వేసింది. తాజాగా జాదవ్ పై ఉగ్రవాదం, మోసం, విద్రోహం కేసులు పెట్టి విచారణ ప్రారంభించింది. ఈ విషయాన్ని 'డాన్' పత్రిక ప్రచురిస్తూ, ఈ కేసులో చార్జ్ షీట్ కూడా వేసినట్టు వెల్లడించింది.

 

కాగా, గత సంవత్సరం మార్చిలో జాదవ్ ను ఇరాన్ లో పట్టుకుని, పాక్ కు తీసుకొచ్చి, తమ దేశంలో ఉగ్రవాద కార్యకలాపాల కోసం ఆయన వచ్చాడని పాక్ సైన్యం అతన్ని అరెస్ట్ చేసింది. ఆ తరువాత విచారణ జరిపి హడావుడిగా మరణశిక్ష విధించింది.