TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నటి కాదంబరి జెత్వానీ కేసు.. కుక్కల విద్యాసాగర్ బెయిల్ పిటిషన్‌పై తీర్పు 16న

Published on: Fri Nov 15, 2024 9:41AM

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నటి జత్వానీ కేసులో అరెస్టైన కుక్కల విద్యాసగర్ బెయిలు పిటిషన్ పై విజయవాడ కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. న్యాయమూర్తి తీర్పును శనివారం (నవంబర్ 16)కు రిజర్వ్ చేశారు. కాగా కుక్కల విద్యాసాగర్ కు బోయిల్ ఇవ్వొద్దంటూ నటి జత్వానీ తరఫు న్యాయవాది శ్రీనివాసరావు వాదించారు.  

కాగా ఈ కేసులో ప్రధాన నిందితుడు కుక్కల విద్యాసాగరరావు బెయిలు పిటిషన్ పై విజయవాడ కోర్టులో గురువారం (నవంబర్ 14)న వాదనలు పూర్తయ్యాయి. తనను తప్పుడు కేసులో ఇరికించి అరెస్టు చేశారంటూ నటి కాదంబరి జెత్వాని ఇబ్రహీంపట్నం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ పై కేసు నమోదు చేసిన పోలీసులు ఆయన డెహ్రాడూన్ లో ఉండగా పట్టుకుని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కోర్టు ఆయనను రిమాండ్ కు తరలించింది. 

తనను తప్పుడు కేసులో ఇరికించి అరెస్టు చేసి వేధింపులకు గురి చేశారని కొద్ది రోజుల క్రితం కాదంబరి జెత్వానీ ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేయగా, వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌పై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కుక్కల విద్యాసాగర్ బెయిలు కోసం కోర్టును ఆశ్రయించారు. అయితే విద్యాసాగర్‌కు బెయిల్ మంజూరు చేస్తే ఆయన సాక్షులను  ప్రభావితం చేస్తారని నటి జత్వాని తరఫు న్యాయవాది వాదించారు. ఈ కేసులో నిందితుడికి అప్పట్లో ఐపీఎస్ అధికారులు సహకరించారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. తప్పుడు పత్రాలు సృష్టించి జత్వానీని అక్రమంగా ముంబై నుంచి తీసుకువచ్చి 42 రోజుల పాటు జైలులో ఉంచారని పేర్కొన్నారు. ఇప్పుడు విద్యాసాగర్ కు బెయిలు మంజూరు చేస్తే వాస్తవాలు బయటకు రాకుండా సాక్షులను ప్రభావితం చేస్తారని జత్వాని తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అంతే కాకుండా కుక్కల విద్యాసాగర్ పరారయ్యే అవకాశం కూడా ఉందన్నారు. ఈ కేసులో ఇరు పక్షాల వాదనలూ విన్న న్యాయమూర్తి తీర్పును శనివారం (నవంబర్ 16)కు రిజర్వ్ చేశారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు పోలీసు అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.