కూచిబొట్ల హత్యకేసు... నిందితుడికి జీవితఖైదు
Published on: Sat May 5, 2018 11:04AM

అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కూచిబొట్ల శ్రీనివాస్ పై కాల్పులు జరిపి హత్య చేసిన సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు ఈ కేసులో ఆ దేశ ఫెడరల్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. 2017 ఫిబ్రవరి 22న హైదరాబాద్‌కు చెందిన కూచిబొట్ల శ్రీనివాస్, అతని స్నేహితుడు అలోక్ మదసాని కెన్సస్‌లోని ఒలేత్ నగరంలోని ఓ బార్‌లో ఉండగా అమెరికాకు చెందిన 52ఏళ్ల ఆడమ్ ‘మా దేశం నుంచి వెళ్లిపోండి’ అంటూ నినాదాలూ చేస్తూ వారిద్దరిపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో శ్రీనివాస్ అక్కడిక్కడే మృతి చెందగా...అలోక్ తీవ్రంగా గాయపడ్డారు. ఇక దీనిపై విచారణ జరిపిన కోర్టు...జాత్యాహంకారంతోనే శ్రీనివాస్‌పై కాల్పులు జరిపి అతడిని హత్య చేసినట్టు పేర్కొని.. జీవిత ఖైదు విధించింది.
ఇక ఈ తీర్పు అనంతరం కూచిబొట్ల భార్య సునయన న్యాయస్థానానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...‘ ఈ తీర్పుతో శ్రీనివాస్ తిరిగి రారు... కానీ ఇలాంటి ఘటనలు ఇకముందైనా జరగకుండా చూడండి. ఈ కేసులో మాకు అండగా నిలబడిన ఓలేత్ పోలీసులకు ధన్యవాదాలు’ అని తెలిపారు.


