TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రాహుల్ కు కేటీఆర్ ట్వీట్.. కాంగ్రెస్ షాక్..!!

Published on: Sat Jul 7, 2018 3:47PM

 

ప్రస్తుతం తెరాస, కాంగ్రెస్ ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది.. మొన్నటికి మొన్న కేటీఆర్ 'తెలంగాణ ఇచ్చింది అమ్మ కాదు బొమ్మ కాదు' అంటూ సోనియా గాంధీని ఉద్దేశించి విమర్శలు చేసారు.. ఈ వ్యాఖ్యలకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు.. తాజాగా కేటీఆర్ రాహుల్ గాంధీకి ట్వీట్ చేసి, ఏకంగా తెలంగాణ కాంగ్రెస్ నే ఇరుకున పెట్టే ప్రయత్నం చేసారు.. ఒకే విడతలో రైతులకు రుణమాఫీ అని తెలంగాణ కాంగ్రెస్ నేతలు చెప్తున్న విషయం తెలిసిందే.. అయితే దీనికి కౌంటర్ గా కేటీఆర్, రాహుల్ కి ట్వీట్ చేసారు..  కర్నాటకలో జేడీఎస్-కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ, తెలంగాణ ప్రభుత్వం లాగానే నాలుగు విడతలుగా చేస్తామని ప్రకటించింది.. కానీ మీ పార్టీ నేతలు తెలంగాణలో ఒకే విడతలో రుణమాఫీ చేస్తాం అంటున్నారు.. మరి ఇదే పార్టీ కర్ణాటకలో ఎందుకు చేయలేకపోతోంది? అని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.