TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రాజాసింగ్ అద్భుత‌ క‌మెడియ‌న్‌.. కేటీఆర్ సెటైర్‌..

Published on: Wed Feb 16, 2022 10:47AM

భారతీయ జనతా పార్టీకి అద్భుతమైన హాస్యనటుడు ఎమ్మెల్యే రాజాసింగ్ దొరికాడని తెలంగాణ మున్సిపల్ మంత్రి కేటీఆర్ సెటైర్ వేశారు. ఉత్తరప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ తెలంగాణ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యూపీలో ఉండాలనుకుంటే యోగికే ఓటు వేయాలని, బీజేపీకి ఓటు వేయని వారి జాబితా తీస్తామని, వారి ఇళ్లపైకి బుల్డోజర్లు, జేసీబీలను పంపిస్తామని వ్యాఖ్యానించారు. రాజాసింగ్ వ్యాఖ్యలపై పలువురు నేతలు ఇప్పటికే మండిపడ్డారు.

తాజాగా మంత్రి కేటీఆర్ కూడా రాజాసింగ్ చేసిన ఆ వ్యాఖ్యల వీడియోను పోస్ట్ చేస్తూ సెటైర్ వేశారు. 'ఇక వీరు నైతికంగా ఇంతకంటే దిగజారరులే అనుకున్న సమయంలోనే.. బీజేపీ నుంచి ఈ కమెడియన్ అకస్మాత్తుగా బయటికి వచ్చాడు. మీరు బీజేపీకి ఓటు వేయకపోతే మీ ఇళ్లను యోగి బుల్డోజర్లతో కూల్చేస్తారని బీజేపీ తెలంగాణ ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు' అని కేటీఆర్ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.

ఉత్తరప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ తెలంగాణ ఎమ్మెల్యే రాజాసింగ్ మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. యూపీలో బీజేపీకి మద్దతివ్వని వారిని హెచ్చరిస్తూ ఓ వీడియో విడుదల చేశారు. యూపీలో ఉండాలనుకుంటే యోగికే ఓటు వేయాలన్నారు. బీజేపీకి ఓటు వేయని వారి జాబితా ఎన్నికల తర్వాత తీస్తామని, వారి ఇళ్లపైకి బుల్డోజర్లు, జేసీబీలను పంపిస్తామని వ్యాఖ్యానించారు. ఇప్పటికే యోగి వేల సంఖ్యలో బుల్డోజర్లు, జేసీబీలను యూపీకి తెప్పించారని రాజా సింగ్ చెప్పారు.

బీజేపీకి ఓటు వేయని వారు ఎన్నికల తర్వాత యూపీలో ఉంటారో, రాష్ట్రం విడిచి పారిపోతారో తేల్చుకోండని హెచ్చరించారు. యోగికి వ్యతిరేకంగా ఓటు వేసే వాళ్లు యూపీని విడిచి వెళ్లిపోక తప్పదంటూ రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.