TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆసియా లీడర్స్ సమావేశానికి కేటీఆర్ కు ఆహ్వానం

Published on: Thu Aug 18, 2022 8:01AM

కేటీఆర్ సీఎం కారు.. అయినా ఆయనకు తెలంగాణలో అంతకు మించి గుర్తింపు ఉంది. ఒక్క తెలంగాణలోనే కాదు.. దేశీయంగా, అంతర్జాతీయంగా కూడా కేటీఆర్ తనదైన ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆ గుర్తింపుతోనే చాలా మంది  సీఎంలకు కూడా దక్కని ఒక అవకాశం ఆయన తలుపు తట్టింది.

బెస్ట్ సీఎంలుగా వివిధ సర్వేలతో ఊదరగొట్టించుకున్న ముఖ్యమంత్రులకూ రాని  గుర్తింపు, అవకాశం కేటీఆర్ తలుపు తట్టింది. ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో జరిగే పలు ఆర్థిక సదస్సులకు ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరైన కేటీఆర్ కు ఇప్పుడు మరో ఆహ్వానం అందింది. అక్టోబర్ 4న స్విట్జర్ ల్యాండ్ లో జరిగే ఆసియా లీడర్స్ సిరీస్ సమావేశానికి కేటీఆర్ కు ఆహ్వానం అందింది. జ్యూరిచ్ లో జరిగే ఈ ప్రతిష్ఠాత్మక సమావేశానికి ఆసియా లీడర్స్ సీరిస్ ఫోరం కేటీఆర్ కు ఆహ్వానం పంపింది. ఆసియా-యూరప్ ఖండాల్లోని పలు దేశాల్లో రాజకీయ అనిశ్చితుల కారణంగా   ప్రముఖ కంపెనీల వ్యాపార అవకాశాలపై పడుతున్న ప్రభావంపై ఈ సమావేశంలో చర్చిస్తారు.

ఆసియా, యూరప్ దేశాలకు చెందిన వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు పాల్గొనే ఈ సమావేశానికి తనకు ప్రత్యేకంగా ఆహ్వానం రావడం పట్ల మంత్రి కేటీఆర్ ఆనందం వ్యక్తం చేశారు.  వివిధ రంగాలకు చెందిన ప్రముఖ వ్యక్తులతో ఆలోచనలు పంచుకునేందుకు దొరికిన అవకాశంగా ఆయన ఈ ఆహ్వానాన్ని అభివర్ణించారు. ఇలాంటి సమావేశాలకు హాజరవడం వల్ల తెలంగాణ గురించి అంతర్జాతీయ వేదికపై ప్రజెంట్ చేసే అవకాశం లభించిందని ఆయన అన్నారు.