TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జీవన్ రెడ్డికి బీఆర్ఎస్ కండువా కప్పిన కేటీఆర్..

Published on: Thu Apr 9, 2026 6:05PM

మాజీ మంత్రి టీఅ. జీవన్ రెడ్డి  బీఅర్ఎస్ గూటికి చేరారు. తన నివాసంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు ఆయనకు బీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం జీవన్ రెడ్డి, కేటీఆర్ లు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు.  

  కేసీఆర్ సూచన మేరకే సహచరులతో కలిసి జీవన్ రెడ్డిని సాదరంగా ఆహ్వానిం చేందుకు ఆయన నివాసానికి వచ్చినట్లు చెప్పారు.  2014 ఎన్నికలకు ముందే కేసీఆర్ జీవన్ రెడ్డిని బీఆర్‌ఎస్‌లో చేరాలని ఆహ్వానించారన్నారు.   కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత జగిత్యాలకు తొలి పర్యటన సందర్భంగా బోర్నపల్లి వంతెన అంశంపై జీవన్ రెడ్డి చేసిన వినతి వెంటనే ఆమోదించిన విషయాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు.

అలాగే చక్కెర కర్మాగారం అంశంపై జీవన్ రెడ్డి పోరాటం చేసిన సందర్భాన్ని కూడా  ప్రస్తావించారు. జీవన్ రెడ్డి వంటి నాయకుడి చేరికతో బీఆర్ఎస్ మరింత బలోపేతం అవుతుందని అన్నారు.   కేసీఆర్ నాయకత్వంలో పని చేయాలనే ఆలోచనే  తనకు ఆనందాన్నిస్తోందని జీవన్ రెడ్డి అన్నారు.  కేసీఆర్‌ను కలిసి తన రాజకీయ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటిస్తానన్నారు.