మంత్రి కాదు ముఖ్యమంత్రి... కళకళలాడుతున్న కేటీఆర్!!

చర్చకు బలం చేకూర్చినట్లుగానే ఉంది. మంత్రి కేటీఆర్ కు స్వాగతం పలికేందుకు నిట్ క్యాంపస్ లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు అధికార పార్టీ నేతలు అందరూ క్యూ కట్టారు. అనంతరం మడికొండ ఐటీ కంపెనీల వద్దకు చేరుకునేందుకు కాన్వాయ్ సిద్ధమవుతుండగా మంత్రి కేటీఆర్ ఒక్కసారిగా డ్రైవర్ సీట్లో కూర్చున్నారు. సైంట్ కంపెనీ అధినేత బీవీ మోహన్ రెడ్డి బెంజి కారును కేటీఆర్ తన కాన్వాయ్ లోని ఇతర వాహనాలతో సమానంగా నడిపించారు. సాధారణంగా మంత్రుల కాన్వాయ్ లో ప్రత్యేకంగా అంబులెన్స్ ఉండదు. కేటీఆర్ కు మాత్రం అంబులెన్స్ తో పాటు రోప్ పార్టీని సైతం ఏర్పాటు చేశారు. మీడియాకు సైతం ఎంట్రీ పాసులను అందజేశారు. మంత్రి కేటీఆర్ డ్రైవ్ చేస్తున్న కారును ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ ప్రైవేటు వాహనంగా భావించి నిలిపివేయటంతో కాన్వాయ్ లో కొద్ది సేపు కలకలం రేగింది.

తాజాగా కేసిఆర్ తరువాత కేటీఆర్ ముఖ్యమంత్రి అంటే తప్పేంటి అంటూ వ్యాఖ్యానించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఆయన ఒక్కరే కాదు మరికొందరు టీఆర్ఎస్ నేతలు కూడా కేసిఆర్ తరువాత కేటీఆర్ సీఎం అంటూ చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో తిరుమల వెంకన్న దర్శనానికి వెళ్లిన మంత్రి కేటీఆర్ కు టీటీడీ అధికారులు దగ్గరుండి మర్యాదలు చేశారు. వైకుంఠ ఏకాదశి సందర్బంగా బయో మెట్రిక్ ద్వారా దర్శనం చేయించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారన్న సమాచారంతోనే ఏపీ అధికార పార్టీ నేతలు, అధికారులు కేటీఆర్ దగ్గరుండి దర్శనం చేయించినట్లు ప్రచారం జరుగుతోంది.