TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ర్యాలీలపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదు: కేటీఆర్

Published on: Tue Nov 6, 2012 4:42PM

KTR congress, kirankumar reddy trs, TRS congress, neelam cyclone ap

 

సీఎం కిరణ్‌కు, మంత్రులకు పార్టీ పనులపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదని టీఆర్ఎస్ శాసనసభ్యుడు కె. తారక రామారావు విమర్శించారు. నీలం తుపాన్ ప్రభావంతో పంటలు దెబ్బతిని దిక్కుతోచని స్థితిలో రైతులు ఉంటే వారిని ఆదుకోకుండా ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని ఆయన దుయ్యబట్టారు. ఢిల్లీలో ర్యాలీకి పరుగులు తీసిన ప్రభుత్వం అన్నదాతలు అష్టకష్టాల్లో ఉంటే నిద్రపోతోందని ఆరోపించారు.


కిరణ్ సర్కార్ రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని కేటీఆర్ మండిపడ్డారు. ముఖ్యమంత్రిని కాపాడటానికి కొందరు ఎమ్మెల్యేలు లాబియింగ్ చేయటం దురదృష్టకరమన్నారు. కరీంనగర్లో రేపటినుంచి రెండు రోజుల పాటు టీఆర్ఎస్ మేధోమథనం జరుగుతుందన్నారు. తెలంగాణ ఉద్యమంపై ఈ సమావేశంలో డిక్లరేషన్ ప్రకటిస్తామన్నారు. అన్ని అంశాలపై కేసీఆర్ స్పష్టత ఇస్తారని కేటీఆర్ తెలిపారు.