TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వంద సీట్లు పక్కా.. రాహుల్ పై కేటీఆర్ విమర్శ

Published on: Sat Aug 25, 2018 4:57PM

ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వంద సీట్లు పక్కా గెలుస్తామని టిఆర్ఎస్ చెప్తున్న విషయం తెలిసిందే.. తాజాగా ఇదే విషయాన్ని కేటీఆర్ మరొక్కసారి స్పష్టం చేసారు.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో వంద సీట్లు గెలిచి సెంచరీ కొట్టనున్నామని కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ ఇదే మాట చెబితే 'అంత సీనా' అన్న అవతలి పక్షాలకు ఆ సీట్లు సాధించి గుణపాఠం చెప్పామని తెలిపారు.

 

 

తాజాగా కేటీఆర్, ప్రగతి నివేదిన సభ గురించి చర్చించేందుకు ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. ఆరు నెలలో, మూడు నెలలో ఎప్పుడో ఓసారి ఎన్నికలు రాక తప్పదు.. ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది.. అందుకే ప్రగతి నివేదన సభ.. ఈ సభ తొలిసారిగా నగర శివారులో జరుగుతున్న నేపథ్యంలో చరిత్రలో నిలిచిపోయేలా విజయవంతం చేయాలి.. అవసరమైన వాహనాలను పార్టీ సమకూరుస్తుంది.. అధిక సంఖ్యలో ప్రజలు హాజరయ్యేలా చూడాలి అని అన్నారు.. అదే విధంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించారు.. తెలంగాణలో కుటుంబ పాలన సాగుతోందని రాహుల్‌గాంధీ పేర్కొనడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుందని అన్నారు.. తాత ముత్తాతల నుంచి కాంగ్రెస్ పార్టీలో వారే ఉన్నారని, పేరు చివరన గాంధీ లేకుంటే వారి పరిస్థితి ఎలా ఉండేదోనని ఎద్దేవా చేశారు.