ముందస్తు ఎన్నికలు వస్తాయని మేం చెప్పలేదు: కేటీఆర్
Published on: Mon Aug 27, 2018 10:46AM
తెలంగాణలో ప్రజల నోట, నాయకుల నోట ఒకటే మాట.. ముందస్తు ఎన్నికలు.. ముందస్తు ఎన్నికలు.. తెరాస ముందస్తు ఎన్నికలకు సిద్ధమైంది, రేపో మాపో అసెంబ్లీని కూడా రద్దు చేస్తుంది అంటూ వార్తలొస్తున్నాయి.. అయితే తెరాస మాత్రం ఈ వార్తలను ఖండిస్తోంది.. తెరాస సీనియర్‌నేత, కరీంనగర్ ఎంపీ బి.వినోద్‌కుమార్ మాట్లాడుతూ.. ముందస్తు ఎన్నికల గురించి చర్చలు జరుగుతున్న మాట నిజమే కానీ మూహూర్తాలు, తేదీలు మేం పెట్టుకోలేదు.. ముహూర్తాలను మేమూ పత్రికల్లోనే చూస్తున్నాం అన్నారు.

ఇక రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ముందస్తు ఎన్నికలు వస్తాయని తామెక్కడా అధికారికంగా చెప్పలేదని, మీడియాలో మాత్రమే రాస్తున్నారనీ అన్నారు.. ఎన్నికల కోసం ప్రగతి నివేదన సభ జరపడం లేదని స్పష్టం చేశారు.. గడచిన నాలుగున్నర సంవత్సరాల్లో ప్రజలకు ఏం చేశామో చెప్పడానికే ఈసభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.. అధికారం కట్టబెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.. మేమేందుకు ఎన్నికలకు భయపడతాం? ముందస్తు ఎన్నికలంటే ప్రతిపక్షాలు ఎందుకు భయపడుతున్నాయి? అని ప్రశ్నించారు.. ప్రజల ముందుకెళ్లడానికి ప్రతిపక్షాలకు ధైర్యం చాలడం లేదని అన్నారు.. ప్రజలు ప్రతిపక్షాలను ఛీకొట్టారని, ప్రజలే తమకు బాస్‌లు అని అన్నారు.. ప్రజలకు మేం జవాబుదారీగా ఉంటాం.. ప్రజల మనసులు దోచుకున్నాం, ప్రతిపక్షాల పార్టీల్లా ప్రజల సొమ్మును దోచుకుని కుంభకోణాలు చేయలేదు అన్నారు.. ఎన్నికలంటే తెరాసకు కొత్తేమీ కాదన్నారు.. ముందస్తు ఎన్నికలపై త్వరలో స్పష్టత వస్తుందని అన్నారు.


