గుండు పోతే గుండు ఫ్రీగా వస్తుందా? బండి సంజ‌య్‌పై కేటీఆర్ సెటైర్లు..

posted on: Jan 5, 2022 6:26PM

చూసే ఉంటారుగా! క‌రీంన‌గ‌ర్‌లో జ‌న జాగ‌ర‌ణ దీక్ష భ‌గ్నం ఎపిసోడ్‌లో ఏం జ‌రిగిందో. పోలీసులు వ‌ర్సెస్ బీజేపీ.. ఖాకీలు వ‌ర్సెస్ బండి సంజ‌య్‌.. హోరాహోరీగా సాగిన ఆ తోపులాట‌లో ఓ విజువ‌ల్ ఫుల్ వైర‌ల్‌గా మారింది. ఆ వీడియోలో త‌న‌ను అరెస్ట్ చేయ‌బోతున్న పోలీసుల‌ను అడ్డుకునే ప్ర‌య‌త్నంలో.. బండి సంజ‌య్ త‌న త‌ల‌ను టేబుల్‌కు కొట్టుకుంటున్న దృశ్యాలు సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అయ్యాయి. గుండును బండకేసి కొట్టుకుంటున్న బండ‌న్న‌.. అంటూ ఆ వీడియో క్లిప్‌ను టీఆర్ఎస్ సోష‌ల్ మీడియా వింగ్ బాగా స‌ర్క్యులేట్ చేసింది. లేటెస్ట్‌గా ఆ వీడియో ఘ‌ట‌న‌పై కేటీఆర్ సైతం సెటైర్లు వేశారు. 

బండి పోతే బండి ఫ్రీగా వ‌స్తుంది.. గుండు పోతే గుండు ఫ్రీగా వ‌స్తుందా? అంటూ సంజ‌య్ ఎపిసోడ్‌పై కేటీఆర్ కౌంట‌ర్లు వేశారు. బండి సంజయ్ పిచ్చోడని,  ఎప్పుడు ఏం మాట్లాడతాడో.. ఏం చేస్తాడో ఆయనకే తెలియదని విమర్శించారు. త‌న త‌ల‌ను తానే గాయ‌ప‌రుచుకొని.. పోలీసులు కొట్టారంటూ అబ‌ద్దాలు చెబుతున్నాడ‌ని.. ఆ వీడియో వాళ్ల ఛానెల్‌లోనే లైవ్ టెలికాస్ట్ అయింద‌ని.. ఆ వీడియో చూస్తే ఎవ‌రు ఎవ‌రిని కొట్టారో తెలిసిపోతుందంటూ బండి సంజ‌య్ తీరుపై సెటైరిక‌ల్‌గా మండిప‌డ్డారు. కేటీఆర్ చేసిన ఆ కామెంట్ల‌ను మ‌రోసారి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేస్తోంది టీఆర్ఎస్ కేడ‌ర్‌.

google-ad-img
    Related Sigment News
    • Loading...