బాబు ఎక్కువ కాలం ప్రజా సేవలో గడపాలి: కేటీఆర్

 

ఏపీ సీఎం చంద్రబాబు 69వ పుట్టినరోజు సందర్భంగా.. ఆయనకు తెలంగాణ మాజీ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టిన రోజులు మీరు మరెన్నో జరుపుకోవాలని. ఎక్కువ కాలం ప్రజా సేవలో గడాపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.