TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

కేంద్రంపై కేటీఆర్ ఫైర్....మాటలే తప్ప, చేతలేం లేవు...

Published on: Sun Mar 25, 2018 12:06PM

 

కేంద్ర ప్రభుత్వంపై ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలు నిప్పులు చెరుగుతున్న సంగతి తెలిసిందే. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఒకపక్క ఏపీ నేతలు పోరాడుతుంటే.. తమకు రిజర్వేషన్ల వాటా పెంచాలని టీఆర్ఎస్ నేతలు పోరాడుతున్నారు. అంతేకాదు...దేశవ్యాప్తంగా ఉన్న మోడీ వ్యతిరేక పార్టీలన్నీ విమర్శలు చేస్తున్నాయి. ఇప్పుడు కేటీఆర్ వంతు వచ్చింది. పెద్దపెద్ద కంపెనీలు, బడా వ్యాపారవేత్తలు వేల కోట్లు కొల్లగొట్టి దేశం విడిచి పారిపోతుంటే... కేంద్రం మౌనంగా ఉందని కేటీఆర్ విమర్శించారు. ఇదే సమయంలో చిన్న పారిశ్రామికవేత్తలను, ప్రజలను ఇబ్బంది పెడుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వానివి మాటలే తప్ప, చేతలేం లేవని తెలంగాణ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఐటీఐఆర్, పారిశ్రామిక అభివృద్ధికి కేంద్రం ఇచ్చిందేమీ లేదని ఆయన విమర్శించారు. కేంద్రం నుంచి ఎలాంటి సహకారం లేకున్నప్పటికీ... ఐటీ విస్తరణకు తామే చర్యలు చేపట్టామని తెలిపారు. రాష్ట్రంలో పారిశ్రామికీకరణపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారని అన్నారు.