కెటీఆర్ కు మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్ శాఖలు

 

తెలంగాణా ఐటి, పంచాయితీ రాజ్ శాఖల మంత్రి కెటీఆర్ కు రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు శాఖలను అప్పగించింది. గ్రేటర్ ఎన్నికల్లో, గులాబీదండుకు నాయకుడిగా వందకు 99 మార్కులు తెచ్చుకున్న కెటీఆర్ ఇప్పుడు టిఆర్ఎస్ లో అత్యంత ఫాలోయింగ్ ఉన్న లీడర్. అందరూ అనుకున్నట్లుగానే, మున్సిపల్ మరియు అర్బన్ డెవలప్ మెంట్ శాఖలు కూడా ఆయన కిందకే రానున్నాయి..ఈ మేరకు తెలంగాణా రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.