తెలుగు విద్యార్ధుల సమస్యలను పట్టించుకోండి.. కేటీఆర్
Published on: Wed Jan 6, 2016 11:06AM

అమెరికా వెళ్లే తెలుగు విద్యార్ధులకు ఇమ్మిగ్రేషన్ అధికారులు ద్వారా కష్టాలు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. విచారణ పేరిట చాలా మంది విద్యార్దులను ఇమ్మిగ్రేషన్ అధికారులు ఇప్పటికే వెనక్కి పంపించేశారు. అయితే ఇప్పుడు ఈ సమస్యను పరిష్కరించడానికి కేటీఆర్ ముందుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆయన అమెరికా కాన్సులేట్ జనరల్ మైఖేల్ ముల్లిన్సను కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్ అమెరికా వెళ్లి చదవాలనకునే తెలుగు విద్యార్ధులకు ఎదురవుతున్న సమస్యలను పట్టించుకోవాలని మైఖేల్ ముల్లిన్సను కోరారు. చదువుకోసం హైదరాబాద్ నుండే ఎక్కువ మంది విద్యార్ధులు అమెరికా వెళుతున్నారని.. ఎంతో సమయం.. డబ్బు వెచ్చించి వెళుతున్న వారిని తిప్పి పంపడం సమంజసం కాదని తెలిపారు. దీనిపై కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ కు కూడా లేఖ రాస్తామని.. ఇక్కడ వరకైతే ప్రభుత్వ పరంగా మేం చర్యలు తీసుకుంటా.. కాన్సులేట్ పరంగా మీరు చర్యలు తీసుకోండి అని సూచించారట. అంతేకాదు విద్యార్ధులకు నకిలా డాక్యుమెంట్లు ఇవ్వడం వల్లే నష్టపోతున్నారని ముల్లిన్సన్ కు చెప్పడం జరిగిందట. దీనికి ముల్లిన్సన్ సమస్య పరిష్కారానికి మేం కూడా ప్రయత్నిస్తున్నాం.. విద్యార్ధుల నకిలీ డాక్యుమెంట్లు వల్లే సమస్యలు వస్తున్నాయని.. తొందరలోనే సమస్య పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారంట.


