TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కేటీఆర్‌కు జైలుకు వెళ్లాలని కుతూహలంగా ఉంది : మంత్రి సీతక్క

Published on: Mon Jun 16, 2025 4:06PM

 

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్‌‌కు జైలు వెళ్లాలని  కుతూహలంగా ఉన్నట్లు ఉందని సీతక్క తెలిపారు. అందుకే వీలైనంత త్వరంగా జైలుకు పంపించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని రెచ్చగొడుతున్నారని ఆయన తెలిపారు. కేటీఆర్‌, కవిత మధ్య పోటీ నెలకొంది. కవిత జైలుకు పోయివచ్చి బీసీ ఎజెండా ఎత్తుకుంది. ఇప్పుడు నేను వెనుకబడ్డా అనుకుంటున్న కేటీఆర్‌.. జైలుకు పోయి పథకం రచించాలనుకుంటున్నారు. 

ఏదో ఆశించి కేటీఆర్‌ జైలుకు పోవాలనుకుంటున్నాడు’ అని మంత్రి సీతక్క విమర్శించారు. కేటీఆర్ పొగరుతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు.ఇక పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సీతక్క మాట్లాడుతూ.. నేటి సమావేశంలో పంచాయతీ ఎన్నికలపై స్పష్టత వస్తుందని అనుకుంటున్నానని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో ఉంటాయని మాత్రమే తాను అన్నానని, నోటిఫికేషన్ గురించి ప్రత్యేకంగా ఏం మాట్లాడలేదని మీడియాలో ప్రచారం జరిగిందని, అది అవాస్తవమని సీతక్క క్లారిటీ ఇచ్చారు.