TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బీఆర్ఎస్ ప‌దేండ్ల‌లో రూ. 3.5 ల‌క్ష‌ల కోట్ల పెట్టుబ‌డులు : కేటీఆర్

Published on: Fri May 30, 2025 7:58PM

 

తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్   ప‌దేండ్ల‌లో 8 వేల‌కు పైగా అనుమ‌తులు, రూ. 3.5 ల‌క్ష‌ల కోట్ల పెట్టుబ‌డులు వ‌చ్చాయ‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. లండన్‌లో జరుగుతున్న బ్రిడ్జ్ ఇండియా వీక్ 2025 సదస్సులో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఐటీ కంపెనీలను తీసుకొచ్చి 10 లక్షల మంది స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించామని ఆయన పేర్కొన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశంలోనే తెలంగాణ నంబ‌ర్ వ‌న్‌గా నిలిచింద‌ని కేటీఆర్ తెలిపారు. హైద‌రాబాద్‌లో టాప్ 5 మ‌ల్టీనేష‌న‌ల్ కంపెనీల అతిపెద్ద క్యాంప‌స్‌లు నెల‌కొల్పాయి. 

టీఎస్ ఐపాస్‌తో సెల్ఫ్ స‌ర్టిఫికేష‌న్ విధానం ప్ర‌వేశ‌పెట్టామని కేటీఆర్ పేర్కొన్నారు. టీఎస్ ఐపాస్‌తో సెల్ఫ్ స‌ర్టిఫికేష‌న్ విధానం ప్ర‌వేశ‌పెట్టామని కేటీఆర్ పేర్కొన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి విప్లవాత్మ‌క విధానం లేదు. ప‌దేండ్ల‌లో 8 వేల‌కు పైగా అనుమ‌తులు, రూ. 3.5 ల‌క్ష‌ల కోట్ల పెట్టుబ‌డులు వ‌చ్చాయి. తెలంగాణకు ఐటీ కంపెనీలు తీసుకువచ్చి 10 లక్షల మంది స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాము. మినిమ‌మ్ గ‌వ‌ర్న‌మెంట్‌.. మ్యాగ్జిమ‌మ్ గ‌వర్నెన్స్ మా విధానం. తెలంగాణ‌లో పెట్టుబ‌డులు పెట్టండి. తెలంగాణ‌లో ప్ర‌తి ఇంటికి సుర‌క్షిత మంచినీరు అందించామ‌ని ఆయన తెలిపారు.