కాంగ్రెస్ ఫలితాలపై మోడీ, కెటీఆర్ ట్వీట్స్
Published on: Sat May 13, 2023 5:46PM
ప్రధాని నరేంద్ర మోడీ కర్ణాటకశాసనసభ ఎన్నికలలో బిజెపి ఓటమి చెందిన తర్వాత ట్వీట్ చేశారు. గెలుపొందిన కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు తెలిపారు.
దక్షిణాదిన బిజెపి అధికారంలో వచ్చిన మొదటి రాష్ట్రం కర్ణాటక. కాంగ్రేస్ పార్టీ నుంచి అధికారం కైవసం చేసుకున్నబిజెపి ఈ ఎన్నికలలో ఆ అధికారాన్ని కాంగ్రెస్ కు తిరిగి అప్పగించింది.
కర్ణాటక ఫలితాల ప్రభావం తెలంగాణపై ఎటువంటి ప్రభావం చూపబోదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి ఆర్ అన్నారు. ప్రస్తుతం పెట్టుబడుల కోసం యుకె వెళ్లిన మంత్రి ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా మంత్రి నూతనంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచినంత మాత్రాన పొరుగునే ఉన్న తెలంగాణలో ప్రభావం ఉంటుందని వస్తున్న వార్తలో నిజం లేదన్నారు.


