TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఒకరిది నేను తీసుకోను.. కన్నీరు పెట్టుకున్న కృష్ణంరాజు

Published on: Thu Aug 30, 2018 2:17PM

నందమూరి హరికృష్ణ మృతికి కుటుంబసభ్యులు, అభిమానులే కాదు.. సినీ, రాజకీయ ప్రముఖులు కూడా విచారం వ్యక్తం చేసారు.. సీనియర్ హీరో కృష్ణంరాజు, హరికృష్ణతో సన్నిహితంగా ఉండేవారు.. హరికృష్ణ మరణ వార్త విని సంతాపం తెలపటానికి వచ్చిన కృష్ణం రాజు.. హరికృష్ణ గురించి మాట్లాడుతూ కన్నీరు పెట్టుకున్నారు.

 

 

'హరికృష్ణ గురించి మాట్లాడటానికి మాటలు రావడం లేదు.. నన్ను అన్నయ్యా అని ఆప్యాయంగా పిలిచేవాడు.. ఈ రోజు ఇలా జరగటం చెప్పలేనంత బాధగా ఉంది.. కొడుకు పోయినప్పుడు దేవుడు ఇంత అన్యాయం చేశాడు అన్నాడు.. ఇపుడు నీక్కూడా దేవుడు అన్యాయం చేశాడురా' అంటూ కృష్ణం రాజు కన్నీరు పెట్టుకున్నారు.. 'హరికృష్ణ నా సొంత తమ్ముడు లాంటోడు.. ఓ రోజు నా కార్లో టేప్ రికార్డర్ చూసి ఎంత బావుందో అన్నయ్యా అన్నాడు.. తీసుకోరా అని నేను అంటే, నేను సంపాదించిన తర్వాత కొనుక్కుంటాను అన్నయ్యా.. ఒకరిది నేను తీసుకోను అన్నాడు.. మీ నాన్నగారిది అయినా ఇలానే అంటావా అంటే, అంతే అన్నయ్య అన్నాడు.. నేను నా సొంతంగా సంపాదించాలి, సొంతంగా బ్రతకాలి అనే నిజాయితీ పరుడు.. ఎవరైనా సంతోషపడుతుంటే చూసి ఆనందపడేవాడు.. పది మందికి ఉపకారం చేయాలనుకునేవాడు' అని అన్నారు.