ఆ నీళ్లు తెలంగాణకు ఎంత..?ఆంధ్రాకు ఎంత.?

కృష్ణానదీ జలాల పంపిణి విషయమై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కరించేందుకు కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు కీలక సూచనలను చేసింది. తాగునీటి అవసరాల కోసం ఇరు రాష్ట్రాలకు 22 టీఎంసీల నీటిని కేటాయించింది..ఏపీకి 16, తెలంగాణకు 6 టీఎంసీల నీటిని కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే శ్రీశైలం రిజర్వాయర్‌లో 854 అడుగులు, నాగార్జున సాగర్‌లో 510 అడుగుల నీటిమట్టాన్ని ఖచ్చితంగా నిర్వహించాలని ఇరు రాష్ట్రాలకు సూచించింది. ఈ ఉదయం హైదరాబాద్ జలసౌధలో జరిగిన సమావేశంలో బోర్డు కార్యదర్శి సమీర్ చటర్జీతో పాటు తెలంగాణ నీటి పారుదల శాఖ ఇంజినీరింగ్ ఇన్ చీఫ్ మురళీధర్, ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావుతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.