TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జీవితాన్ని నిలబెట్టిన 'తెలుగువన్ ఫౌండేషన్'

Published on: Thu Apr 12, 2012 5:32PM

కృష్ణాజిల్లా: నిరుపేదల బ్రతుకులలో వెలుగులు నింపడానికి, నిస్వార్ధ సేవనే నిరుపమానంగా అందించడానికి  నిరంతరం శ్రమిస్తూ తెలుగువన్ అధినేత శ్రీ కంఠంనేని రవిశంకర్ గారు నిలువనీడలేని వారికి గృహ సముదాయాన్ని ఏర్పరచి వారి జీవితాల్లో వెలుగులు నింపుతూ, వందకు పైగా గుండె ఆపరేషన్లు చెవి, కాలి ఆపరేషన్లు, క్యాన్సర్ ఆపరేషన్లు చేయించినారు. గ్రామీణ ప్రాంతంలో కార్పొరేటెడ్ స్థాయిలో ఉచిత కంప్యూటర్ శిక్షణ అందిస్తూ మరియు గ్రామీణ మహిళలకు కంప్యూటర్ రంగంలోఉపాధి కల్పిస్తూ, గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేద విద్యార్ధులకు స్కాలర్ షిప్ రూపంలో ఆర్ధిక సాయం అందించి వారి ఉజ్జ్వల భవిష్యత్తుకు పునాదులువేస్తూ, అలాగే దివిసీమ తీరప్రాంతంలో వివిధ గ్రామాల్లో ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ లు స్థాపించి ప్రజల దాహార్తిని తీర్చటంలోనూ, మరియు చేనేత, రైతు కుటుంబాలకు ఆర్ధిక సహాయాన్ని అందిస్తూ, దివిసీమలో ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడినప్పుడు తనదైన శైలిలో వారిని ఆదుకుంటున్నారు.

వ్యవసాయ పనులు చేస్తూ, మరోవైపు జీవనాధారం కోసం ముఠా కూలిగా పనిచేస్తున్న చిట్టిమోతు శ్రీనివాసరావుకు కుడికాలులోని బాల్ కు రక్తప్రసరణ అందక చచ్చుబడిపోయింది. ఈ తరుణంలో కంఠంనేని రవిశంకర్ కు తన కుటుంబ పరిస్థితిని వివరించారు. హైదరాబాద్ లోని ప్రముఖ వైద్యశాలలో వైద్య పరీక్షలు నిర్వహించగా 3.50 లక్షలు అవుతుందని వైద్యులు చెప్పారు. శ్రీనివాసరావు కుటుంబం అంతమొత్తం భరించే స్థితిలో లేరు. ఆ పరిస్థితుల్లో అతనికి వైద్య సాయం అందించేందుకు రవిశంకర్ సుముఖత వ్యక్తం చేశారు. దీంతో గతనెల 21న హైదరాబాద్ లో కుడికాలులో చచ్చుబడిపోయిన బాల్ ను తొలగించి కొత్తబాల్ వేశారు. ప్రస్తుతం శ్రీనివాసరావు కోలుకుంటున్నాడు. శస్త్రచికిత్స ద్వారా తనకు పునర్జీవితాన్ని కల్పించిన ఫౌండేషన్ అధినేత రవిశంకర్, ప్రతినిధులు  కంఠంనేని శివశంకర్ లకు కుటుంబం తరపున కృతజ్ఞతలు చెప్పాడు.