TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కృష్ణాజిల్లా రైతు పోరుబాటలో గర్జించిన చంద్రబాబు

Published on: Thu Jan 26, 2012 9:21AM

హైదరాబాద్: కృష్ణాజిల్లా మచిలీపట్నంలో ముగిసిన రైతు పోరుబాటలో చంద్రబాబు గర్జించారు. బుధవారం బాబు మచిలీపట్నంలో రైతు పోరుబాటను చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  రాష్ట్రాన్ని కాంగ్రెస్  నేతలు పందికొక్కుల్లా దోచుకుతింటున్నారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వంపైనా ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. ఎక్కడ చూసినా అవినీతి పేరుకుపోయిందని ... దాన్ని అంతం చేసేవరకు రాజీలేని పోరాటం చేస్తానని చంద్రబాబు స్పష్టంచేశారు. చివరి రక్తపు బొట్టు వరకు రైతుల కోసం శ్రమిస్తానన్నారు. రెండేళ్లు పార్టీని నడపలేని వాళ్లు సామాజిక న్యాయం ఎలా చేస్తారని చిరంజీవిపై చంద్రబాబు పరోక్ష విమర్శలు చేశారు. అంతకుముందు పెడన మండలం నుంచి మొదలైన పాదయాత్రలో పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. రైతులు, ప్రజలు రోడ్డుకు ఇరువైపులా చేరి స్వాగతాలు పలికారు. మార్గమధ్యలో పొలాలకు వెళ్లి రైతులతో బాబు ముచ్చటించారు. వాళ్ల సాధక బాధల్ని అడిగి తెలుసుకున్నారు. రాబోయే ఉప ఎన్నికల్లో బాలకృష్ణ పోటీ చేయడని చంద్రబాబు చెప్పడాన్ని వైఎస్సార్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. ఓటమి భయంతోనే ఆయనలా మాట్లాడుతున్నారని విమర్శించారు.