TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బాలయ్య రాకతో కోలాహలం..గెలిపించాల్సిన బాధ్యత మీదే

Published on: Sun Jan 8, 2012 11:47AM

విజయవాడ: టిడిపిని అధికారంలోకి తీసుకు రావడానికి కార్యకర్తలు కృషి చేయాలని ,2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాల్సిన బాధ్యత కార్యకర్తల పైనే ఉందని ప్రముఖ సినీ హీరో నందమూరి బాలకృష్ణ  కృష్ణా జిల్లాలో అన్నారు. కృష్ణా జిల్లాలోని పామర్రులో బాలకృష్ణ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పింఛి ,పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ   బడుగు, బలహీన వర్గాల కోసమే దివంగత ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని చెప్పారు. 2014లో టిడిపిని ప్రజలు అఖండ మెజార్టీతో గెలిపిస్తారని చెప్పారు. అనంతరం ఆయన పామర్రు నుండి కూచిపూడి మీదుగా ఘంటశాల వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అక్కడ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. బైక్ ర్యాలీలో భారీగా అభిమానులు, టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు. పలువురు ప్రముఖ నేతలు కూడా పాల్గొన్నారు. అన్ని ప్రాంతాల్లో బాలయ్యకు అభిమానులు, తెలుగు తమ్ముళ్లు ఘన స్వాగతం పలుకుతున్నారు. బాలయ్య రాకతో జిల్లా అంతటా కోలాహలం కనిపిస్తోంది. ఆయన ఎక్కడి నుండి పోటీ చేసినా స్వాగతిస్తామని కార్యకర్తలు చెబుతున్నారు. ఆయన రాక అన్ని వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోందంటున్నారు.