TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మళ్లీ కరోనా కాలం.. మాస్కులు అనివార్యం?

Published on: Thu May 22, 2025 9:01PM

కరోనా మహమ్మరి మరో సారి దాడి చేస్తున్నదా? ఇక మళ్లీ మాస్కులు లేకుండా బయటకు రాలేని, రాకూడని పరిస్థితులు ఏర్పడుతున్నాయా? అంటే ఔననే అంటున్నారు వైద్య నిపుణులు. దేశ వ్యాప్తంగా మళ్లీ కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. కేరళలో మే నెలలో ఇప్పటి వరకూ 182 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మాస్కులు ధరించడాన్ని తప్పని సరి చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అ

దలా ఉండే కోవిడ్ కేసుల వ్యాప్తం ప్రపంచ వ్యాప్తంగా కనిపిస్తోంది. ముఖ్యంగా హాంకాంగ్, థాయ్ ల్యాండ్, సింగపూర్ లలో కోవిడ్ వ్యాప్తి తీవ్రత ఒకింత అధికంగా ఉంది. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ, జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందనీ కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. జలుబు, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తే.. బయటకు రాకుండా విశ్రాంతి తీసుకోవాలని సూచించింది. ఇప్పుడు వ్యాపిస్తున్న ఓమిక్రాన్ ఉప-వేరియంట్‌లు స్వల్ప ఆనారోగ్య కారకాలేకానీ ప్రమాదకరమైనవి కావని పేర్కొంది.