TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆర్మీ మాజీ చీఫ్ కొటికలపూడి వెంకట కృష్ణారావు కన్నుమూత..

Published on: Sat Jan 30, 2016 3:24PM

మాజీ గవర్నర్, ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ కొటికలపూడి వెంకట కృష్ణారావు (93) ఈరోజు తుదిశ్వాస విడిచారు. 1923లో విజయవాడలో జన్మించిన కొటికలపూడి వెంకట కృష్ణారావు 1942 నుంచి 1983 వరకు ఇండియన్ ఆర్మీలో పనిచేశారు. 1983లో ఆర్మీ నుంచి రిటైర్ అయ్యారు. ఆయన సేవలను గుర్తించిన ప్రభుత్వం ఆయనకు విశిష్ట సేవా మెడల్ ఇచ్చి సత్కరించింది. అంతేకాదు రిటైర్ అయిన తరువాత ఆయన జమ్మూ కాశ్మీర్, నాగాలాండ్, మణిపూర్, అగర్తల రాష్ట్రాలకు గవర్నర్‌గా కూడా వ్యవహరించారు. కాగా ఆయన మరణానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు.