TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కోస్తా కారిడార్ తో విధ్వంసం తప్పదు

Published on: Mon Mar 19, 2012 2:17PM

కోస్తా కారిడార్ ఏర్పాటు చేయడం వల్ల ఈ ప్రాంతంలో పర్యావరణానికి తీవ్రనష్టం వాటిల్లడమే కాకుండా ప్రజల సామాజిక, ఆర్ధిక స్థితిగతులు దెబ్బతింటాయని పర్యావరణ, సామాజిక శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కోస్తా కారిడార్ కు వ్యతిరేకంగా ఈ నెల 25న వారు హైదరాబాద్ లో ఒక సదస్సును కూడా నిర్వహించబోతున్నారు. ఓ ఎన్ జిస్, సెజ్ ల కారణంగా కృష్ణా, గోదావరి డెల్టాలు ప్రమాదపు అంచుల్లో ఉన్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు కోస్తా కారిడార్ ను కూడా ఏర్పాటుచేస్తే విపత్తు తప్పదని వారు హెచ్చరిస్తున్నారు. కోస్తా కారిడార్ లో భూమి ఉపరితలం వేడెక్కడానికి కారణమైన వాయువులను విడుదలచేసే ప్రమాదకర పరిశ్రమలను ఏర్పాటుచేయబోతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో 75 శాతం పంటలు పండే కోస్తాతీరంలో కాలుష్యకారక పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ముప్పు తప్పదంటున్నారు. విషపూరితరసాయనాలు సముద్రంలో కలిస్తే మత్య్ససంపదకు ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు. కోస్తా కారిడార్ కు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలతో పాటు న్యాయ పోరాటానికి వారు సన్నాహాలు చేస్తున్నారు.