Latest News
పిల్లడికి హిందీ నేర్పుతున్న కొరియా తల్లి
posted on: Jul 20, 2022 5:51PM
పిల్లాడు పరుగున లోపలికి వచ్చి మమ్మీ అనగానే పొంగిపోతుంది తల్లి. మమ్మీ గిమ్మీ ఏమిటే.. చక్కహా అమ్మా అని పిలవడం నేర్పించకుండా.. అంటూ పిల్లాడి అమ్మమ్మగారు గొంతుచించుకుంటుంది... ఇది దాదాపు అందరి ఇళ్లలోనూ ఇటీవలి కాలంలో కనిపించే సీన్. నిజవే మన భాషలో పలకరించుకోవడం, తిట్టుకోవడం లో అందం వేరు. చిత్రమేమంటే విదేశీయులు చక్కగా తెలుగు నేర్చుకుని ఇంట్లో ప్రాక్టీసు చేస్తున్నారు. భారతీయులను స్నేహం చేసుకోవడమే కాకుండా వారికి తెలిసిన భారతీయ భాషను కూడా నేర్చుకోవడంలో వారికి అదో ఆనందం. ఇపుడు కొరియా వాళ్లూ హిందీ నేర్చుకుని, వారి పిల్లలకూ మెల్లగా నేర్పు తున్నారట. అందుకు ఉదాహరణ కిమ్.
ఇంగ్లీషు వ్యామోహం మరీ పెచ్చు మీరిపోతోందని స్కూళ్లలో ఉపాధ్యాయులూ అంటున్నారు. ఇంగ్లీషు నేర్చుకోవడం వేరు, అదే రోజూవారీ జీవితంగా చేసుకోవడం ఎంతో వేరు. పెద్దవారంటే ఉద్యోగాలు, వృత్తి వ్యాపారాల్లో ఎక్కువ ఆంగ్లం మాట్లాడటం తప్పనిసరి. కానీ పిల్లలకూ అదే నేర్పి అదో అద్బుతం అని ఉప్పొంగిపోతే ఎలా? ఇక మన భాష పిల్లలకు ఎలా వస్తుంది? మన భాషా రావాలి, అటు ఇంగ్లీషూ రావాలి కదా?! కానీ కొరియాకు చెందిన కిమ్ అనే అమె తన పిల్లవాడికి చిన్నచిన్నపదాలు నేర్పుతోంది. మొన్నా మధ్య పకోడీ కూడా తయారు చేసింది. ఏ పకోడీ హై అంటూ చిన్నముక్కను పట్టుకుని ఫోటో కూడా తీయిం చుకుంది.
విదేశీ భాష నేర్చుకోవడంలో ఉన్న ఆసక్తి మన భాష మీద లేకపోవడం విచారకరం. మన భాష మీద వారికి ఉన్న ఆసక్తి హర్షణీయమే.. కానీ వారు వారి మాతృ భాషను మాత్రం మర్చిపోవడం లేదు. ఇది మనవాళ్లు గుర్తుంచుకోవాలి.


.webp)
.webp)


