చెస్ క్వీన్ కోనేరు హంపి లైఫ్ ‘కింగ్’ ఇతనే!!
Published on: Sat Aug 2, 2014 11:14AM

ప్రఖ్యాత చదరంగం క్రీడాకారిణి, ఆంధ్రప్రదేశ్ తెలుగుదేజం కోనేరు హంపి వివాహం ఈనెల 13వ తేదీన విజయవాడలో జరగబోతున్న విషయం విదితమే. ప్రతిభావంతురాలైన క్రీడాకారిణి మాత్రమే కాకుండా మంచి అందగత్తె కూడా అయిన కోనేరు హంపి వివాహం చేసుకునే వరుడు ఎలా వుంటాడో చూడాలన్న ఆసక్తి అందరిలోనూ వుంది. ఇదిగో.. ఇతనే చెస్ క్వీన్ కోనేరు హంపి లైఫ్‌లో ‘కింగ్’. ఈ యువకుడి పేరు దాసరి అన్వేష్. ఎఫ్ట్రానిక్స్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ దాసరి రామకృష్ణ కుమారుడు. అందం, అణకువ, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు వున్న కోనేరు హంపి వివాహం తగిన వరుడితో జరిపించడానికి ఆమె తండ్రి కోనేరు అశోక్ ఎంతోకాలంగా జరుపుతున్న అన్వేషణ దాసరి అన్వేష్ కనిపించడంతో ముగిసింది. కోనేరు హంపి - దాసరి అన్వేష్ ఎంగేజ్‌మెంట్ కార్యక్రమం మే నెలలో జరిగింది. ఈ జంటను చూసినవారందరూ చూడముచ్చటగా వుందని ఆశీర్వదించారు.


