TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జూడాలకు బెదిరేది లేదు తెగేసి చెప్పిన కొండ్రు

Published on: Fri Feb 10, 2012 2:14PM

హైదరాబాద్: జూనియర్ డాక్టర్లకు స్టైఫండ్ పెంచే ఆలోచనే లేదని వైద్య శాఖ కొత్త మంత్రి కొండ్రు మురళి స్పష్టం చేశారు. వారి  బెదిరింపులకు లొంగేది లేదన్నారు. జూనియర్ డాక్టర్లు సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించడంతో ఆయన స్పందించారు. పేద ప్రజల ఆరోగ్యం కోసం జూనియర్ డాక్టర్లు కృషి చేయాలన్నారు. వారి ఆందోళన వల్ల సామాన్యులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. జూడాల సమ్మె వల్ల కార్పోరేట్ ఆసుపత్రులు లాభపడుతున్నాయన్నారు. వారు వెంటనే సమ్మె విరమించాలని ఆయన కోరారు. జూనియర్ డాక్టర్ల కోరికలు అన్యాయమైనవని ఆయన అన్నారు. జూనియర్ డాక్టర్ల వెనుక కొంతమంది వ్యక్తులు ఉన్నారని ఆరోపించారు. ప్రైవేటు ఆస్పత్రుల లాభం కోసమ ఈ సమ్మె అని మంత్రి అన్నారు.

కాగా తాము ఇన్ని రోజులుగా ఉద్యమిస్తున్నప్పటికీ ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేదని జూనియర్ డాక్టర్లు ఆరోపిస్తున్నారు. ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని వారు శుక్రవారం ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రోజుల తరబడి సమ్మెలు, నిరాహార దీక్షలు చేస్తున్నా ఎలాంటి స్పందన రాకపోవడంతో సాయంత్రం నుండి అత్యవసర సేవలు నిలిపి వేయాలని డాక్టర్ల జెఏసి నిర్ణయించింది.