TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వైసీపీ విధ్వంసంతో చైర్మన్ ఎన్నిక వాయిదా.. ఎస్ఈసీ తప్పుకోవాలన్న చంద్రబాబు 

Published on: Tue Nov 23, 2021 1:52PM

అనుకున్నట్లే జరిగింది. కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఎన్నిక నిరవధికంగా వాయిదా పడింది. వరుసగా రెండో రోజు చైర్మన్ ఎన్నిక జరగపోవడంతో... కొండపల్లి ఎన్నిక రాష్ట్ర ఎన్నికల సంఘం పరిధిలోకి చేరింది. చైర్ పర్సన్ ఎన్నిక సందర్భంగా మంగళవారం  కూడా వైసీపీ కౌన్సిలర్లు విధ్వంసం సృష్టించారు. 

హైకోర్టు తీర్పు వస్తే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుందని టీడీపీ తెలిపింది. కార్యాలయంలోనే టీడీపీ సభ్యులు, ఎంపి కేశినేని నాని కూర్చొన్నారు. వైసీపీ సభ్యులు, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ బయటకు వెళ్లిపోయారు. కొండపల్లి మున్సిపల్ కార్యాలయం నుంచి ఎన్నికల అధికారి సునీల్ కుమార్ రెడ్డి సైతం బయటకు వెళ్లిపోయారు. సర్ది చెప్పినా సభ్యులు తగ్గలేదని.. దీంతో ఎన్నికకు అవకాశం లేకుండా పోయిందన్నారు  రిటర్నింగ్ అధికారి సునీల్ కుమార్ రెడ్డి. అందుకే ఎన్నికను వాయిదా వేశామన్నారు. లోపలే ఉన్న టీడీపీ సభ్యుల గురించి అడిగితే... సునీల్ కుమార్ స్పందించకుండా వెళ్లిపోయారు.

కొండపల్లి మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ మెజార్టీ సీట్లు సాధించింది. మున్సిపాలిటీల్లో 29 వార్డులు ఉండగా వైసీపీ 14, టీడీపీ 14 చోట్ల గెలుపొందాయి. 14వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. అయితే ఇండిపెండెంట్ గా గెలిచిన శ్రీలక్ష్మి టీడీపీలో చేరారు. దీంతో కొండపల్లిలో టీడీపీకి మెజార్టీ వచ్చింది. విజయవాడ ఎంపీ కేశినేని నాని కూడా ఎక్స్ అఫిషియే మెంబర్ గా కొండపల్లి నమోదు చేయించుకున్నారు. దీంతో టీడీపీ బలం 16కు చేరింది. వైసీపీకి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఓటు ఉన్నా.. వాళ్ల బలం 15 15 దగ్గరే ఆగిపోయింది. దీంతో టీడీపీకి చైర్మెన్ పీఠం దక్కకుండా వైసీపీ కుట్రలు చేస్తోంది. సోమావరం చైర్మన్ ఎన్నిక జరగాల్సి ఉండగా.. నానా రభస స్పష్టించి అడ్డుకుంది. మంగళవారం కూడా చైర్మెన్ ఎన్నిక జరగకుండా విధ్వంసం స్పష్టించింది. 

కొండపల్లి చైర్‌పర్సన్‌ ఎన్నిక వాయిదాపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా? అని ప్రశ్నించారు. విధ్వంసం సృష్టించి... ఎన్నిక వాయిదా వేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనన్నారు. ఎన్నిక నిర్వహించడం చేతగాకపోతే ఎస్ఈసీ, డీజీపీ పదవి నుంచి తప్పుకోవాలన్నారు. ఎన్నికను అడ్డుకునే బదులు అధికారపార్టీ వారినే చైర్మన్‌గా నియమించుకోవాలన్నారు. భయబ్రాంతులకు గురిచేసి టీడీపీ సభ్యులను లోబర్చుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. సంబంధం లేని వ్యక్తులు మారణాయుధాలతో హల్‌ చల్ చేస్తున్నా... అక్కడే ఉన్న  పోలీసులు చోద్యం చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యులు క్రమశిక్షణ, ఓర్పుతో వ్యవహరిస్తున్నారని, తమ సహనాన్ని చేతగానితనంగా పరిగణించొద్దన్నారు. ఎన్నిక నిర్వహించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చంద్రబాబు అన్నారు.