పరకాల విజయంపై కొండా సురేఖ ధీమా
Published on: Sat Apr 28, 2012 10:21AM
పరకాల ఉప ఎన్నికల్లో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయబోతున్న కొండా సురేఖ ఇప్పుడు ఆత్మవిశ్వాసంతో మాట్లాడుతున్నారు. ఎన్నికల్లో తన విజయం ఖాయమంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణా సెంటిమెంటుగా ఉన్న పరకాలలో ఆమె పోటీ చేసినా గెలవటం కష్టమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అయితే పరిస్థితులు కలిసి రావటంతో ఆమెకు అనూహ్యంగా విజయావకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి తెలంగాణా సెంటిమెంటు ఉన్నా టి.ఆర్.ఎస్.లో ఐక్యత లేకపోవడమే. పరకాలలో టి.ఆర్.ఎస్. అభ్యర్థితో పాటు బిజెపి, తెలుగుదేశంపార్టీలు కూడా తమ అభ్యర్థులను రంగంలోకి దిమ్పుతున్నాయి. దీనివల్ల తెలంగాణా సెంటిమెంటు ఓట్లు చీలిపోతాయని, అందువల్ల తాను గత ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ కన్నా రెట్టింపు మెజార్టీతో విజయం సాధించగలనని ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో సుమారు 18 వేల ఓట్ల మెజారిటీతో ఆమె గెలుపొందారు.


