సురేఖకు ఎం.ఎల్.సి సీటు
Published on: Mon Jul 2, 2012 10:21AM
పరకాల ఎన్నికల్లో ఓడి గెలిచానన్న కొండా సురేఖ కొత్తగా ఎన్నికైన వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మేల్యేల ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి అలకబూని రాలేదని తెలిసింది. ఇది తెలిసిన వైసిపి గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ హైదరాబాద్ లోని సురేఖ ఇంటికెళ్లి ఎంఎల్సీ సీటు ఇస్తానని ఓదార్చినట్లు తెలిసింది. తెలంగాణాలో తమకు గట్టి మద్దతుదారులుగా వున్నందున, కేవలం పదిహేను వందల ఓట్ల తేడాతో ఓడిపోయిన సురేఖను గౌరవనీయంగా వుంచటానికే విజయమ్మ ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అన్ని పార్టీలు లోపాయికారిగా టిఆర్యస్ కు ఓట్లు వేయడం ద్వారా తాను ఓడినట్లు సురేఖ అంటున్నారు. ఈ సందర్బంగా ఆమె త్వరలో తెలంగాణలో ఓదార్పు యాత్ర కొనసాగిస్తామని, మూడు నెలల్లో కెసిఆర్ తెలంగాణ తీసుకు రాకపోతే ఆయన్ని నిలదీసే కార్యక్రమం చేపడతామని విజమయ్య చెప్పినట్లు తెలిసింది.


