కొండా లక్ష్మణ్ బాపూజీకి నివాళి!
Published on: Fri Sep 27, 2024 12:47PM

తెలంగాణ సాధన ఉద్యమానికి కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు మరువలేనివని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సమితి పురుడుపోసుకున్నది కొండాలక్ష్మణ బాపూజీ నివాసంలోనేనని ఆయన చెప్పారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా కేటీఆర్ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. స్వాతంత్ర్య పోరాటం నుంచి మలిదశ తెలంగాణ ఉద్యమం వరకు కొండా లక్ష్మణ్ బాపూజీ ప్రజా పోరాట యోధుడిగా నిలిచారని పేర్కొన్నారు.


