టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నాం.. కొణతాల
Published on: Tue Dec 22, 2015 10:29AM
.jpg)
కొణతాల రామకృష్ణ, గండి బాబ్జి ఈరోజు టీడీపీ అధినేత చంద్రబాబును కలిసిన సంగతి తెలిసిందే. ఈసందర్బంగా వారు టీడీపీలోకి చేరుతున్నట్టు వార్తలు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొణతాల మాట్లాడుతూ టీడీపీలోకి చేరాలని నిర్ణయించుకున్నాం.. మా నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశమయి ఎప్పుడు టీడీపీలో చేరతామనే విషయం చెబుతామని అన్నారు. మరోవైపు మంత్రి అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ.. కొణతాల సంక్రాంతి తరువాత టీడీపీలో చేరుతారని.. చంద్రబాబు ఆమోదం తెలిపిన తరువాత ఎవరూ వ్యతిరేకించేది ఉండదని స్పష్టం చేశారు.


