ఆయనుంటే పార్టీలో మేముండం..!


తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య ఉన్న విబేధాలు మరోసారి బయటపడ్డాయి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. టీ.పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్ కొనసాగితే మేం ఉండమని తేల్చి చెప్పారు. నేను వదిలేసిన మంత్రి పదవిని ఉత్తమ్ తీసుకున్నాడు.. లాబీయింగ్ తో పీసీసీ సంపాదించాడు.. అని అన్నారు. ఉత్తమ్ నన్ను పొమ్మనలేకే పొగ పెడతున్నారు.. కావాలనే సోషల్ మీడియాలో మాపై దుష్ర్పచారం చేస్తున్నాడు..కాంగ్రెస్ శిక్షా తరగతుల్లో నన్ను కావాలనే అవమానించాడు.. ఉత్తమ్ వల్లే తెలంగాణ మూడేళ్లు ఆలస్యమైందని అన్నారు. ఉత్తమ్ సారధ్యంలో 2019 ఎన్నికలకు వెళితే ఐదారు సీట్లు కూడా రావు అని అన్నారు. పీసీసీ ప్రక్షాళన లేదని అధికారికంగా ప్రకటన చేస్తే.. మా దారి మేం చూసుకుంటాం... కార్యకర్తలతో మాట్లాడి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు.