కోమటిరెడ్డి ఒక బేవకూఫ్

 

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక బేవకూఫ్ అట. భయపడకండి... ఈ మాట అన్నది ఏ సీమాంధ్ర నాయకుడో, లేదా తెలంగాణకే చెందిన మరోపార్టీ నాయకుడో కాదు... స్వయానా తెలంగాణకు చెందిన ఆయన పార్టీ నాయకుడే ఇంత ఘాటైన మాట అన్నారు. తెలంగాణకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పాల్వాయి గోవర్దన్‌ రెడ్డి కోమటిరెడ్డిని ఇంతమాట అన్నారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి నియామకాన్ని వ్యతిరేకిస్తున్నందుకు కోమటిరెడ్డి మీద ఆయన ఇలా నోరుచేసుకున్నారు. ఒక్క ‘బేవకూఫ్’తోనే ఆయన సరిపెట్టలేదు. కోమటిరెడ్డిని ఆయన... భూమ్మీద ఉన్న పెద్ద మూర్ఖుడు (బిగ్గెస్ట్‌ ఫూల్‌ ఆన్‌ ద ఎర్త్‌) అని అభివర్ణించారు. అలాగే రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా చేయాలని పాల్వాయి గోవర్దన్ రెడ్డి కోరుకున్నారు. పార్టీకి సోనియాగాంధీతోపాటు రాహుల్ గాంధీ అవసరం కూడా ఎంతో వుందని ఆయన చెప్పుకొచ్చారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu