కవిత గెలుపుపై ఆధారపడిన కోమటిరెడ్డి భవిష్యత్తు..!!
Published on: Sat Jul 7, 2018 11:16AM

తెలంగాణ రాజకీయం.. అధికారపక్షం, ప్రతిపక్షాల సవాళ్లు, ప్రతి సవాళ్లతో రోజురోజుకి వేడెక్కుతుంది.. మొన్నటికి మొన్న కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉండండి అంటూ సవాల్ విసిరితే.. కాంగ్రెస్ మేము సిద్దమే అంటూ ప్రతిసవాల్ విసిరింది.. ఇక కేటీఆర్ అయితే వచ్చే ఎన్నికల్లో తెరాస గెలవకపోతే రాజకీయాల నుండి తప్పుకుంటానంటూ ఉత్తమ్ కి సవాల్ విసిరారు.. అయితే ఇప్పుడు సీన్లోకి కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎంట్రీ ఇచ్చారు.. సోనియాను ఉద్దేశించి బొమ్మ అంటూ కేటీఆర్ స్థాయికి మించి మాట్లాడుతున్నారని మండిపడ్డ ఆయన.. ‘వచ్చే ఎన్నికల్లో తెరాసకు వంద సీట్లు వచ్చే మాట దేవుడెరుగు.. నిజామాబాద్ ఎంపీగా మీ చెల్లి కవితను గెలిపించుకుంటే నేను రాజకీయ సన్యాసం స్వీకరిస్తా.. ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి మాటిమాటికి సవాల్ విసరడం కాదు.. దమ్ముంటే నా సవాల్‌ను స్వీకరించాలి' అని కోమటిరెడ్డి, కేటీఆర్ కు సవాల్ విసిరారు.


