TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నా తమ్ముడికి మంత్రి పదవి ఇప్పించే స్థాయిలో నేను లేను..మంత్రి కీలక వ్యాఖ్యలు

Published on: Tue Aug 5, 2025 8:41PM

 

మంత్రి పదవి విషయంలో మనుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి చేసిన కామెంట్స్‌పై మంత్రి వెంకట్‌ రెడ్డి స్పందించారు.  మంత్రి పదవిపై తన సోదరుడు రాజగోపాల్‌ రెడ్డికి హామీ ఇచ్చిన విషయం తనకు తెలియదని చెప్పారు.  తన సోదరుడికి మంత్రి పదవి ఇచ్చే స్టేజ్‌లో తాను లేనంటూ వెంకట్‌రెడ్డి అన్నారు. కేబినెట్‌లో తాను సీనియర్‌ మంత్రి అయినప్పటికీ హైకమాండ్‌ నిర్ణయమే కీలకమని చెప్పారు. 

సీఎం, పీసీసీ చీఫ్‌ కలిసి పదవులపై నిర్ణయం తీసుకుంటారని అన్నారు. తాను మంత్రి పదవి ఇచ్చే.. ఇప్పించే పరిస్థితుల్లో లేనని తెలిపారు. అంతా హైకమాండ్‌, రాష్ట్ర నాయకత్వం చూసుకుంటుందని అన్నారు. నేనే కాదు, ఎవరూ ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేశారు. రెండు నెలల్లో ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణానికి టెండర్లు పిలుస్తామని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. 

కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు. సీఎం రేవంత్ రెడ్డి స్ట్రీమ్ లైన్ చేసుకుంటూ వెళ్తున్నారని మంత్రి అన్నారు. సినీ కార్మికుల వేతనాలపై మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి సినిమాకు టికెట్ల రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వం అవకాశం ఇస్తుందని నిర్మాతలు మొండిగా ఉండకుదన్నారు. కార్మికుల డిమాండ్లను పరిగణలోకి తీసుకొని, జీతాలు పెంచాలని సూచించారు.ఇదే విషయంపై పలువురు నిర్మాతలు మెగాస్టార్ చిరంజీవిని కలిశారు.