పూనమ్ పై కొల్లు రవీంద్ర క్లారిటీ...

 

ఇప్పుడు ఎక్కడ చూసినా కత్తి మహేశ్, పవన్ కళ్యాణ్, పవన్ అభిమానులు, పూనమ్ కౌర్, కోన వెంకట్ వీళ్ల చుట్టే వార్తలన్నీ తిరుగుతున్నాయి. కొన్ని మీడియా ఛానెళ్ళు అయితే అన్ని విషయాలు పక్కన పెట్టి కేవలం ఈ విషయం మీదే ఫోకస్ పెట్టాయి. రోజు మొత్తం ఈ వార్తలనే చూపిస్తూ... రచ్చ రచ్చ చేస్తున్నాయి. ఇక ఈ ఎపిసోడ్ లోనే కత్తి మహేశ్, పవన్ పై చేసిన విమర్శలకు పూనమ్ కౌర్ స్పందించి.. కత్తిపై పరోక్షంగా కామెంట్లు చేసింది. ఇక పూనమ్ చేసిన ట్వీట్లపై కూడా కత్తి స్పందించి.. ఏకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. పూనమ్ పై ఆరు ప్రశ్నలు సంధించి.. వాటికి సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో ఈ వ్యవహారం ఇంకా ముదిరింది.

 

ఇక పూనమ్ కు ఎవరి సిఫార్స్ మీద ఏపీ చేనేత అంబాసిడర్ పదవి ఇచ్చారన్న ప్రశ్న కూడా ఉంది. దీంతో పూనంకు బ్రాండ్ అంబాసిడర్ పదవి ఎవరిచ్చారు? ఎవరి సిఫార్సుతో ఇచ్చారు? ఏ అర్హతతో ఇచ్చారు? అంబాసిడర్‌గా నియమించడానికి అసలు కారణాలేంటని అనుమానాలు వ్యక్తమయ్యాయి. మరోవైపు ఇక ఈ వ్యవహారంపై పూనం తమ్ముడు శ్యామ్ సింగ్ కూడా స్పందిస్తూ...పూనం కౌర్ నిఫ్ట్‌లో చదువుకుంది... పూనంకు చేనేతపై పూర్తిగా అవగాహన ఉంది... గత మూడేళ్లుగా ఆమె చేనేతపై ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేస్తోంది. పూనం కృషి చూసి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బ్రాండ్ అంబాసిడర్‌గా పెట్టారు. అంతే తప్ప.. ఎవరూ సిఫార్సుతో ఈ పదవి రాలేదని స్పష్టం చేశాడు.

 

ఇదిలా ఉండగా ఈ వ్యవహారంపై చేనేత శాఖకు మంత్రిగా ఉన్న కొల్లు రవీంద్ర క్లారిటీ ఇచ్చారు. చేనేత వస్త్రాలకు సంబంధించి బ్రాండ్ అంబాసిడర్ ఎవర్ని నియమించారని ఓ మీడియా ప్రతినిధి కొల్లు రవీంద్రను అడుగగా.... "నేను చేనేత శాఖకు మంత్రిగా ఉన్న సమయంలో చేనేత వస్త్రాలకు సంబంధించి ఎవరినీ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించలేదు. అసలు ప్రభుత్వ పరంగా అలాంటి నియామకమే జరగలేదు. ప్రభుత్వ పరంగా అంబాసిడర్‌ను నియమించాలనే చర్చ ఎప్పుడూ జరగలేదు. కొంతమంది చేనేత సంఘ సభ్యులు పవన్‌ కల్యాణ్‌ను అంబాసిడర్‌గా ఉండాలని చెప్పి ఆయన్ను కలిసి కోరారు. ఆ సమయంలో ఆయనకు చేనేత వస్త్రాలు కూడా అందించారు. అంతే తప్ప చేనేత వస్త్రాలకు సంబంధించి ఎవరినీ బ్రాండ్ అంబాసిడార్‌గా నియమించలేదు.. చేనేతకు ఎవరూ బ్రాండ్ అంబాసిడర్‌ లేరు" అని ఆయన తేల్చిచెప్పారు.

 

మరి పూనమ్ సోదరుడేమో.. పూనంకు చేనేతపై పూర్తిగా అవగాహన ఉంది.. గత మూడేళ్లుగా ఆమె చేనేతపై ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేస్తోంది. పూనం కృషి చూసి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బ్రాండ్ అంబాసిడర్‌గా పెట్టారని చెబుతున్నారు. మరోపక్క.. కొల్లు రవీంద్ర చేనేతకు ఎవరూ బ్రాండ్ అంబాసిడర్‌ లేరు అని అంటున్నారు. మరి ఏది నిజమో... ఎవరు చెప్పింది నిజమో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే..